ఆన్ లైన్ విధానంలో ఉల్లి విక్రయాలు! పత్తి కొనుగోళ్లు ప్రారంభం 1 m ago
గత వారం రోజులుగా రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలలో క్రయవిక్రయాలు జరుగు ఈ-నామ్ నందు ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగా, టెండరు జరుపుటకు ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా, రాష్ట్ర వ్యవసాయ మరియు మార్కెటింగ్ శాఖా మంత్రి కింజరాపు అచ్చెంనాయుడు మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించి, టెండరు విధానంలో నెలకొన్న సాంకేతిక సమస్యను పరిష్కరించారు. మంత్రి ఆదేశాల మేరకు కర్నూలు మార్కెట్ యార్డు నందు కమీషన్ ఏజెంట్లు మరియు వ్యాపారస్థులతో సమీక్ష సమావేశము నిర్వహించి క్రయవిక్రయాలు ఆగిపోయినటువంటి ఉల్లిగడ్డలను వాహనముల ద్వారా త్వరగా బయటకు తరలించుటకు చర్యలు తీసుకున్నారు.
ఈ రోజు కర్నూలు మార్కెట్ యార్డుకు 43,000 బస్తాల ఉల్లిగడ్డలు క్రయవిక్రయానికి రాగా, ఈ-నామ్ నందు సాంకేతిక సమస్య పరిష్కారము అవడంతో ఈ రోజు క్రయవిక్రయాలు ఆన్లైన్ పద్దతిలో జరిగాయి.
పత్తి కొనుగోళ్లు ప్రారంభం :
కాటన్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (సి.సి.ఐ.) ఆధ్వర్యంలో రాష్ట్రంలో 2024-25 సీజన్ కు సంబదించి పత్తి కొనుగోలు కొరకు రైతులు రైతు సేవా కేంద్రములలో నమోదును 27 అక్టోబర్ 2024 నుండి ప్రారంభించడం జరిగినది.
రైతులు, వారి యొక్క పంట వివరములను రైతు సేవా కేంద్రముల నందు నమోదు చేసుకోనవలసినదిగా అధికారులు సూచించారు. సి.సి.ఐ. వారి నాణ్యత ప్రమాణములు ఉన్నటువంటి పత్తిని మాత్రమే కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు.
ఖరీప్ 2024-25 సీజన్ కు సంబంధించి భారత ప్రభుత్వం ప్రకటించిన పత్తి కనీస మద్దతు ధరలు:
పొడవు పింజ : రూ.7521/- క్వింటాలకు
పొట్టి పింజ : రూ.7121/- క్వింటాలకు